సప్తమాతృకలు

పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.

01. బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.

02. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.

03. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.

04. వైష్ణవి: విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహన్నని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.

05. వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.

06. నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.

07. ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

ఇవీ సప్తమాతృకలు. అంటే సర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.

ఇలా ‘సర్వం శక్తిమయం’ అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ